విమానం కంటే వేగంగా దూసుకెళ్లే వాహన సౌకర్యం ఏదన్నా ఉందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఇది చదివాక మీరే నమ్ముతారు. సుదూర ప్రాంతాలకు తొందరగా చేరుకోవాలంటే మనం మొదటగా విమానాన్ని ఎంచుకుంటాం. అయితే వాతావరణం బాగోని పరిస్థితుల్లో విమానాల సర్వీసులను రద్దు చేస్తుంటారు. అలానే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్ళు కూడా విమాన వేగాన్ని చేరుకునేవి లేవు.
ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి వినూత్న ఆవిష్కారణే ఈ "హైపర్ లూప్". ఇది గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో పయానిస్తుంది. అంటే విమాన వేగం కంటే ఎక్కువ. అయితే ఈ హైపర్ లూప్ మార్గం ద్వారా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా విమానాన్ని మించిన వేగంతో ప్రయాణించవచ్చు.
కాగా, ప్రస్తుతం అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లాస్‌ఏంజిల్స్‌కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు ఈ హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి రానుంది. 1100 కిలోమీటర్లు విమానం కంటే స్పీడుగా ప్రయాణీకులకు సరికొత్త వేగం అనుభూతిని భూమిమీద ప్రయాణిస్తూనే పొందవచ్చు. అయితే, ఈ మార్గంలో ప్రయాణించాలంటే.. ప్రయాణ ఛార్జీ కూడా కాస్తంత ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది సుమీ.