Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకాశంలో మరో అద్భుతం.. ఆగస్టు 11న ఉల్కలతో భారీ వెలుగు.. అర్థరాత్రి నుంచి తెల్లవారే వరకు..?!

ఆకాశంలో మరో అద్భుతానికి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 11న అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో అద్భుతాన్ని చూసి ఆనందించవచ్చు. ఎలాగంటారా? అయితే ఈ స్టోరీ చదవండి. మినుగురు పురుగుల వెలుగులా.. గంటకు సుమార

ఆకాశంలో మరో అద్భుతం.. ఆగస్టు 11న ఉల్కలతో భారీ వెలుగు.. అర్థరాత్రి నుంచి తెల్లవారే వరకు..?!
, మంగళవారం, 9 ఆగస్టు 2016 (11:39 IST)
ఆకాశంలో మరో అద్భుతానికి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 11న అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో అద్భుతాన్ని చూసి ఆనందించవచ్చు. ఎలాగంటారా? అయితే ఈ స్టోరీ చదవండి. మినుగురు పురుగుల వెలుగులా.. గంటకు సుమారు 200 వరకు ఉల్కలు భూవాతావరణానికి ప్రవేశించనున్నాయి. ఈ ఉల్కల ద్వారా ఒక్కసారిగా భారీ వెలుగు వెదజల్లుతాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
 
ఈ ఉల్కలు సెకనుకు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చే సమయంలో అడ్డువచ్చే దుమ్ము, ధూళి కణాలను ఢీకొన్నప్పుడు మండిపోయి భారీ వెలుగు వస్తుంది. ఇలాంటి ఉల్కల వెలుగు ఎన్నో సంవత్సరాలకు ఓసారే చూసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్త బిల్ కుక్ తెలిపారు. ఈ ఉల్కలు బిలియన్ మైళ్ల పాటు ప్రయాణించి.. ఆపై భూవాతావరణంలోకి వస్తాయని.. ఆ సమయంలో దుమ్ము, ధూళిని ఢీకొని మండితూ వెలుగునిస్తాయని శాస్త్రవెత్తలు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రిని ఫుల్లుగా మద్యం తాగించాడు.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు..!