Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చోరీ చేస్తూ చిక్కిన మహిళలు.. బెదిరించి కోర్కె తీర్చుకున్న షాపింగ్‌మాల్ స్టోర్ మేనేజర్!

చోరీ చేస్తూ చిక్కిన మహిళలు.. బెదిరించి కోర్కె తీర్చుకున్న షాపింగ్‌మాల్ స్టోర్ మేనేజర్!
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (09:16 IST)
షాపింగ్‌మాల్‌లో దొంగతనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. చోరీ చేస్తున్న సమయంలో ఈ మహిళలను గుర్తించిన స్టోర్ మేనేజర్... పోలీసులకు పట్టిస్తానని బెదిరించి అత్యాచారం చేశాడు. అయితే, స్టోర్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ అత్యాచార దృశ్యాలు రికార్డు కావడంతో ఆ మేనేజర్ జైలు ఊచలు లెక్కించక తప్పలేదు. అమెరికాలోని టెన్నెసీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
టెన్నెసీ, క్లార్స్‌విల్లేలో గల డాలర్‌ జనరల్‌ షాపింగ్‌ మాల్‌ ఉంది. ఇందులో చోరీ చేసేందుకు ఇద్దరు మహిళలు వచ్చారు. వీరి వయస్సు 44, 32గా ఉండొచ్చు. వీరిద్దరు డ్యూటీలో ఉన్న స్టోర్ అసిస్టెంట్‌ మేనేజర్‌ రాబర్ట్‌ లిండూ చేతికి చిక్కారు. ఒంటరిగా ఇద్దరు మహిళలు చేతికి చిక్కడంతో వారిని శారీరకంగా అనుభవించాలని భావించాడు. 
 
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా తన కోర్కె తీర్చకుంటే పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. పైగా తాను చెప్పినట్టు నడుచుకోవాలని హెచ్చరించాడు. దాంతో ఆ మహిళలు అతను చెప్పినట్టు వినడానికి అంగీకరించారు. వారిద్దరినీ ఆండ్రూ స్టోర్‌ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరినీ వివస్త్రలను చేసి తన కోరిక తీర్చమన్నాడు. వేరే దారి లేక ఆ మహిళలు రాబర్ట్‌ చెప్పినట్టే చేసి.. తాము దొంగిలించిన వస్తువులను తీసుకుని బయటకు వెళ్లిపోయారు. 
 
అయితే వారు దొంగతనం చేయడం, రాబర్ట్‌ వారిని స్టోర్‌ రూమ్‌కు తీసుకెళ్లడం, తిరిగి వారు ఆ వస్తువులతో ఉడాయించడం అక్కడ ఉన్న సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. రాబర్ట్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు రాబర్ట్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu