Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిగరెట్ పొగతో బిడ్డను కృంగదీసే తల్లులున్నారంటే నమ్ముతారా? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసా?

అమ్మతనం ఒక వరం.. పెళ్లైన ప్రతి యువతి తల్లి కావాలని ఎన్నో కలలు కంటుంది. బిడ్డని కనడం తల్లికి మరో జన్మ వంటిది. పురుడు పోసుకునేటప్పుడు పురుటి నొప్పులు రావడం సహజం. అలాంటిది పురుడు పోసుకునేప్పుడు ఆ బాధను భ

Advertiesment
Teenagers
, మంగళవారం, 21 జూన్ 2016 (09:15 IST)
అమ్మతనం ఒక వరం.. పెళ్లైన ప్రతి యువతి తల్లి కావాలని ఎన్నో కలలు కంటుంది. బిడ్డని కనడం తల్లికి మరో జన్మ వంటిది. పురుడు పోసుకునేటప్పుడు పురుటి నొప్పులు రావడం సహజం. అలాంటిది పురుడు పోసుకునేప్పుడు ఆ బాధను భరించలేమని.. కడుపులోని బిడ్డకు పోషకాలకు బదులు.. సిగిరెట్ పొగను ఇస్తూ బిడ్డను కృంగదీసే తల్లులున్నారంటే నమ్ముతారా... కనీవిని ఎరుగని ఆ తల్లుల గురించి తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. 
 
పుట్టే బిడ్డ బాగా ఎదిగి, బలంగా ఉంటే పురిటి నొప్పుల బాధ ఎక్కువగా ఉంటాయని ఆస్ట్రేలియా తల్లుల గట్టి నమ్మకం. కాబట్టి అలాంటి పరిణామాల నుండి బయటపడేందుకు బిడ్డ పరిమాణం తగ్గించేందుకు ఆస్ట్రేలియాలోని మహిళలు గర్భం ధరించిన నాటి నుంచి ఎక్కువగా పొగ తాగుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇలా చేస్తే బిడ్డ బరువు తగ్గి పురుటి బాధలు పడకుండా బయటపడడానికే ఈ పని చేస్తున్నట్లు వారు తెలిపినట్లు సర్వే సంస్థ వివరించింది. దాదాపు 10 ఏళ్లపాటు ఆస్ట్రేలియాలోని పొగ తాగేవారి మీద చేసిన పరిశోధనలో ఈ వింత నిజాలు బయటకు వచ్చాయి. 
 
పదహారేళ్ల వయసు నుంచే అమ్మాయిలు పొగ తాగడం మొదలు పెడుతున్నట్లు తెలిపారు. గర్భం దాల్చితే పురిటిలో తీవ్రమైన నొప్పులు వస్తాయనే వారు పొగ తాగుతున్నట్లు వెల్లడించినట్లు తెలిపారు. ఇదంతావారికి ఎలా తెలుసో... తెలిస్తే.. వారి బుర్రకి సలాం కొట్టాల్సిందే.. పొగ తాగడం కారణంగా బిడ్డల బరువు తగ్గుతుందని సిగిరెట్ ప్యాకెట్ల మీద చూడటం వల్లే ఇలా చేస్తున్నట్లు వారు చెప్పడం గమనార్హం. 
 
గర్భం దాల్చిన స్త్రీలు బలహీనంగా ఉండటమే వారి భయానికి కారణంగా సర్వే సంస్థ భావిస్తోంది. గర్భం దాల్చడాన్నే కారణంగా చూపిస్తూ సిగిరెట్ తాగడాన్ని అలవాటు చేసుకుంటున్న మహిళలు ఎందరో... భయంతో రోజులో ఎక్కువ సంఖ్యలో సిగిరెట్లను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ యోగా డే : శరీరాన్ని మెలికలు తిప్పుతూ యోగాసనం వేసిన మోడీ.. ఇంకా...