Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తుపాకీ ఆశ చూపి 13 యేళ్ళ బాలుడితో మహిళా టీచర్ రాసలీలలు.. ఆపై జైలుపాలు!

తుపాకీ ఆశ చూపి 13 యేళ్ళ బాలుడితో మహిళా టీచర్ రాసలీలలు.. ఆపై జైలుపాలు!
, బుధవారం, 1 జూన్ 2016 (15:49 IST)
గురువంటే దైవంతో సమానం. అలాంటి గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థితో రాసలీలలు జరిపింది ఓ మహిళ. తన శృంగారకోరికలు తీర్చుకోవడానికి ఆ బాలుడికి ఆశలు చూపించి సరససల్లాపాలు సాగించాలని భావించింది. దీనికోసం తుపాకీని ఇస్తానని చెప్పి.... తన కోరిక తీర్చుకుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటపడటంతో అరెస్టయి జైలుకు వెళ్లింది.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఫ్లోరిడాకు చెందిన ఓ పాఠశాలలో జేమీ హైత్‌ అనే మహిళ థర్డ్ గ్రేడ్ టీచర్‌‌గా పని చేస్తుంది. ఆమెకు సెక్స్ కోరికలు ఎక్కువ ఉండడంతో వాటిని తీర్చుకోవడానికి ఓ 13 యేళ్ళ విద్యార్థిని ఎంచుకుంది. ఆ బాలుడికి తుపాకీ ఇస్తానని చెప్పి.. ఇంటికి పిలిపించి ఆ బాలుడితో సెక్స్‌లో పాల్గొనేది.
 
అనంతరం ఆ బాలుడికి నిజమైన తుపాకీనే ఇచ్చి ఇంటికి పంపించింది. ఇలా తుపాకీ ఆశని చూపించి చాలాసార్లు ఆ బాలుడితో కామకోరికలను తీర్చుకుని ఆనందం పొందేది. అయితే ఒకరోజు బాలుడి స్కూల్‌ బ్యాగ్‌లో తుపాకీ చూసిన మరో ఉపాధ్యాయుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్కూల్‌కి వెళ్ళిన పోలీసులు ఆ బాలుడిని విచారించగా అసలు గుట్టు బయటపడింది. తుపాకి ఆశ చూపించి తనతో సెక్స్‌ చేసిన జేమీ గురించి వివరంగా చెప్పాడు. దీంతో పోలీసులు జేమీపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ ఆక‌ర్ష్ ఫెయిల్... వై.ఎస్.జగన్ ఎత్తుగడ స‌క్సెస్... వచ్చినవారంతా కోవర్టులా...?