Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రొమాన్స్ టాక్... మొదటి స్థానంలో బ్రిటీషర్లు

రొమాన్స్ టాక్... మొదటి స్థానంలో బ్రిటీషర్లు
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:01 IST)
ఆకర్షించే అందం.. మైమరిపించే సోయగం, చిలకపలుకులు గురించి విన్నాం కానీ.. పలికే మాట తీరు సెక్సీగా ఉంటుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రత్యేకతను సొంతం చేసుకున్నది ఎవరో కాదు బ్రిటీషర్లు. తమ మాట తీరుతో ఎంతో సెక్సీగా ఉండటమేకాదు.. ప్రపంచంలో ఇలాంటి గొప్పతనం వారికి మాత్రమే సొంతమని తేలింది. ప్రపంచంలో సెక్సీగా మాట్లాడేవారి జాబితాను తయారు చేస్తే.. ప్రపంచ వ్యాప్తంగా మాటతీరు సెక్సీగా ఉండేవారిలో బ్రిటీషర్లు ముందున్నారు. 
 
ప్రపంచ ప్రఖ్యాత నగరాలకు చెందిన 11 వేల మంది టైమ్స్ అవుట్ అనే ఒక మ్యాగ్‌జైన్ చేసిన తాజా సర్వేలో పాల్గొన్నారు. ఇంతకీ ఆ సర్వే ఏంటంటే.. ప్రపంచ భాషల్లో పలికే తీరులో సెక్సీగా హోయలు పోయేది ఎవరన్న అంశంపై సర్వేలు జరిపారు. ఈ సర్వేలో బ్రిటీషర్ల ఇంగ్లీష్ యాక్సింట్ అదిరిపోతుందని.. సెక్సీగా ఉండటమే కాదు.. వారి ఉచ్ఛారణే మత్తుగా.. గమ్మత్తుగా అందరికి మత్తుకలిగేలా ఉంటుందని తేల్చారు.
 
సెక్సీ ఉచ్ఛారణలో బ్రిటీష్ యాక్సెంట్ తర్వాతే ఏ భాష అయినా అని తేల్చిచెప్పేశారు. మొదటి స్థానం అయితే ఆ తర్వాత స్థానం అమెరికన్ యాక్సెంట్‌కే దక్కింది. అయితే బ్రిటీషర్లకు.. అమెరికన్లకు మధ్య అంతరం భారీగా ఉండటం గమనార్హం. బ్రిటీషర్లకు 27 శాతం ఓట్లేసిన వారు.. అమెరికన్ల మాట తీరుకు కేవలం 8.7 శాతం మందే ఓటేయటం గమనార్హం. ఏమైనా తాజా సర్వే పుణ్యమా అని అత్యంత సెక్సీగా మాట్లాడేవారిగా బ్రిటీషర్లు మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu