Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వీడన్‌లో తొలి ఎలక్ట్రిక్ రహదారి ప్రారంభం.. భారత్‌లో అందుబాటులోకి వచ్చేనా?

ప్రపంచంలోనే తొలిసారి స్వీడన్ దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ రోడ్డును పరీక్షించింది. సెంట్రల్ స్వీడన్‌లో ఈ రహదారి తాజాగా ప్రారంభించారు. స్థానికంగా ఉండే ట్రక్ కంపెనీల తయారీ సంస్థ అయిన స్కానియాతో కలిసి స్థానిక

స్వీడన్‌లో తొలి ఎలక్ట్రిక్ రహదారి ప్రారంభం.. భారత్‌లో అందుబాటులోకి వచ్చేనా?
, శుక్రవారం, 1 జులై 2016 (15:54 IST)
ప్రపంచంలోనే తొలిసారి స్వీడన్ దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ రోడ్డును పరీక్షించింది. సెంట్రల్ స్వీడన్‌లో ఈ రహదారి తాజాగా ప్రారంభించారు. స్థానికంగా ఉండే ట్రక్ కంపెనీల తయారీ సంస్థ అయిన స్కానియాతో కలిసి స్థానిక ప్రభుత్వం రెండు కిలోమీటర్ల మేరకు ఈ ఎలక్ట్రిక్ రహదారిని నిర్మించింది.
 
పర్యావరణహిత, స్మార్ట్ రవాణా విధానానికి ఈ ఎలక్ట్రిక్ రోడ్లు ఎంతగానో దోహదం చేస్తాయని స్వీడిష్ ట్రాన్స్ పోర్టు కంపెనీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ లీనా ఎరిక్సన్ చెప్పారు. అలాగే, ఈ రోడ్డు పనితీరుపై ఆయన స్పందిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ కేబుల్స్ సాయంతో అందే విద్యుత్తుతో బస్సులు, ట్రక్కులు నడుస్తున్నాయని చెప్పారు. 
 
ఈ ఎలక్ట్రిక్ రోడ్ల నిర్మాణంతో కార్బన్ డైఆక్సైడ్‌తో పాటు ఎలాంటి కాలుష్యం లేని పర్యావరణరహిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. సరికొత్త ఎలక్ట్రిక్ రోడ్ల టెక్నాలజీ భవిష్యత్‌లో రవాణారంగాన్ని మలుపుతిప్పుతుందని రవాణారంగ నిపుణులు భావిస్తున్నారు.
 
రోడ్డుపై అమర్చిన విద్యుత్ వైర్ల నుంచి ఏకంగా 750 ఓల్ట్స్ విద్యుత్ ప్రసరణ జరుగుతుందని, దీంతో ఒక ట్రక్కు ఏకంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పుకొచ్చారు. విద్యుత్ సౌకర్యం లేనిచోట ట్రక్కుకు అమర్చిన లిథియం బ్యాటరీ లేదా ట్రక్కు ట్యాంకులో నిల్వవుండే బయో ఫ్యూయల్‌తో సులభంగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని ఆయన వివరించారు. అయితే, ఇలాంటి రహదారులు భారత్‌లో అందుబాటులోకి రావాలంటే కొన్ని దశాబ్దాల పాటు వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైసూర్ ప్యాలెస్ ప్రధాన అర్చకుడి ఆత్మహత్య... బిపి, షుగర్ ఉన్నాయని...