Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేయసి కోసం కుక్కకు పోట్లు... సమర్థించిన ప్రియురాలు

ప్రేయసి కోసం కుక్కకు పోట్లు... సమర్థించిన ప్రియురాలు
, బుధవారం, 1 అక్టోబరు 2014 (08:41 IST)
ప్రేమ మైకంలో నిండా మునిగిపోయిన ప్రేమపిచ్చోడు ఏ పనైనా చేస్తాడనేందుకు ఈ దారుణ ఘటనే నిదర్శనం. పోలెండ్ లోని ఓల్స్టిన్ సిటీలో ఉన్న వార్మియా అండ్ మాజురీ యూనివర్శిటీలో సదరు ప్రేమికుడు నాలుగో సంవత్సరం వెటర్నరీ సైన్స్ విద్య అభ్యసిస్తున్నాడు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం 'ఐ లవ్ యూ' అన్న ఆంగ్ల పదాలను ఓ కుక్క పొట్టకు కుట్టేసి ఆ ఇమేజ్ ను తన ప్రేయసి ఫేస్ బుక్ పేజిలో పెట్టాడు. 
 
ఈ బొమ్మ చూసి ప్రియురాలు స్పందన సంగతి ఏమోగానీ అతడి స్నేహితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడి ప్రవర్తనపై వారు యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అతడి వింత చేష్టపై అధికారులు దర్యాప్తు చేసారు. విపరీత చర్యేనని వారు అభిప్రాయపడ్డారు కానీ అతగాడి గాళ్ ఫ్రెండ్ మాత్రం దానిని సమర్థించింది. 
 
అతడు తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించాడని అంటోంది. ఐతే కుక్కను కట్టేసి క్రూరంగా ప్రవర్తిస్తూ దానిని హింసిస్తూ అలా చేయడంపై మూగజీవాల హక్కుల అధికారులు రంగంలోకి దిగారు. మరి వారిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu