Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. కొన్ని సెకన్లకే.. భారీ శబ్దంతో..

అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. కొన్ని సెకన్లకే.. భారీ శబ్దంతో..
, సోమవారం, 29 జూన్ 2015 (16:15 IST)
అమెరికాలో స్పేస్ ఎక్స్ అనే సంస్థకు చెందిన రాకెట్ ఒకటి అంతరిక్షంలోకి బయలుదేరిన కొన్ని సెకన్లకే ఆకాశంలో భారీ శబ్దంతో పేలిపోయింది. ఫోరిడా రాష్ట్రంలో ఉన్న రాకెట్ కేంద్రంలో నుంచి అంతరిక్షంలోకి ఫాల్కాన్ 9 అనే రాకెట్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఎప్పటిలానే కౌండౌన్ ముగిసిన తర్వాత ఆకాశంలోకి దూసుకెళ్లిన ఫాల్కాన్ 9 రాకెట్ కొన్ని సెకన్లకే ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయింది. 
 
అయితే అదృష్టవశాత్తు ఆకాశంలో పేలిపోయిన రాకెట్ శిథిలాలుపడి ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఆ రాకెట్‌లో వస్తువులు, పరికరాలు మాత్రమే ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయినప్పటికీ ఈ ప్రమాదం గురించి తీవ్ర విచారణ జరపాలని నాసా ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu