Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొసలిని ముద్దాడి.. ఆపై పెళ్ళాడి... అదీ ఓ నగరానికి మేయర్.. ఎక్కడ?

మొసలిని ముద్దాడి.. ఆపై పెళ్ళాడి... అదీ ఓ నగరానికి మేయర్.. ఎక్కడ?
, మంగళవారం, 28 జులై 2015 (06:43 IST)
చాలా మంది జంతువులపై ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కార్చుతుంటారు. వాటిని పరిరక్షించే వారి స్థాయిలో పోజులు పెడుతుంటారు. కానీ నేరుగా మెుసలిని ముద్దాడి పెళ్లి చేసుకునే వారిని ఎవరినైనా చూశారా... అదే మరి ఇలా మెక్సికోలో ఈ మధ్యే ఓ మేయర్‌, ఒక మొసలిని వివాహం చేసుకున్నాడు. మొసలి , మేయర్‌ ఒక్కటయ్యారు.
 
మెక్సికోలోని శాన్‌పెడ్రో హ్యుమొలులా మేయర్‌ జోయల్‌ వాస్‌క్వెజ్‌ రోజాస్‌ అందరి సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఒక మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటీ ? శాన్‌పెడ్రో హ్యుమొలులా గ్రామస్తులకు తరతరాలుగా ఒక నమ్మకం ఉంది. ఊరికి పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తి మొసలిని పెళ్లి చేసుకుంటే అక్కడ మత్స్య సంపద భారీగా అభివృద్ధి చెంది, సంపదలు వస్తాయని వారి విశ్వాసం. 
 
స్వయానా మేయర్‌ భార్య మొసలి తరపున పెళ్లి పెద్దగా వ్యవహరించారు. పెళ్లి కోసం మొసలిని అందంగా పెళ్లికూతురిలా తయారు చేశారు. మేయర్‌ దానికి ఇసబెల్‌ అని పేరు పెట్టారు. ఈ పెళ్ళి సాధాసీదాగా ఏమి జరగలేదు. ధూమ్ ధామ్‌గా జరిగింది. మెక్సికో నగరమంతా మార్మోగింది. పెళ్లి తర్వాత విందు భోజనాలు కూడా పెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu