Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానంలో పాము... ఆకుపచ్చని రంగులో వేలాడుతూ కనిపించింది.. సర్వీస్ రద్దు..

విమానాల్లో పాములు కనిపించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. 2016 నవంబర్‌లో ఏరోమెక్సికో విమానం ప్రయాణిస్తుండగా పైనున్న లగేజీ కంపార్ట్‌మెంట్‌ నుంచి ఆకుపచ్చ పాము ఒకటి వేలాడుతూ కలకలం సృష్టించింది. వవిమానం ల్యాం

విమానంలో పాము... ఆకుపచ్చని రంగులో వేలాడుతూ కనిపించింది.. సర్వీస్ రద్దు..
, సోమవారం, 9 జనవరి 2017 (16:22 IST)
విమానాల్లో పాములు కనిపించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. 2016 నవంబర్‌లో ఏరోమెక్సికో విమానం ప్రయాణిస్తుండగా పైనున్న లగేజీ కంపార్ట్‌మెంట్‌ నుంచి ఆకుపచ్చ పాము ఒకటి వేలాడుతూ కలకలం సృష్టించింది. వవిమానం ల్యాండయ్యే వరకు సిబ్బంది దానిని దుప్పట్లలో బంధించి ఉంచి జాగ్రత్తపడ్డారు. విమానం ల్యాండవగానే ప్రయాణికుల్ని మరో ద్వారం గుండా దించి యానిమల్‌ కంట్రోల్‌ బృందాన్ని పిలిపించి పామును తొలగించారు.
 
తాజాగా ఎమిరేట్స్ సంస్థకు చెందిన విమానంలో ఆదివారం పాము కనిపించడంతో ప్రయాణీకులు జడుసుకున్నారు. దీంతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఆ విమానం రద్దు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఎమిరేట్స్‌ సంస్థకి చెందిన ఈకే0863 విమానం ఆదివారం మస్కట్‌ నుంచి దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది.
 
ప్రయాణికులు విమానం ఎక్కుతున్న సమయంలో కార్గో లోపల ఉన్న పామును సిబ్బంది గమనించి.. కిందకు తోసేశారు. ప్రయాణీకులను కూడా కిందికి దించేశారు. విమానం నుంచి పామును తొలగించారు కానీ ఈ గందరగోళం కారణంగా ఆ విమాన సర్వీసును రద్దు చేసేశారు. జరిగిన పొరపాటుకి ఎమిరేట్స్‌ అధికారులు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. ఆడదాని వేషం.. నైటీలో ఇంటికొచ్చాడు.. భర్త ఉండగానే?