Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భవిష్యత్‌లో అణు యుద్ధాలు తప్పంటున్న శాస్త్రవేత్త... భారత్‌పై పాక్ దాడి చేస్తుందా?

భవిష్యత్‌లో అణు యుద్ధాలు, జీవరసాయనిక దాడులు తప్పేలా లేవని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక రంగంలో మానవుడు అవలంభిస్తున్న చర్యల వల్ల ఈ తరహా యుద్ధాలు తప్పేలా కనిపించడం లేదన్

భవిష్యత్‌లో అణు యుద్ధాలు తప్పంటున్న శాస్త్రవేత్త... భారత్‌పై పాక్ దాడి చేస్తుందా?
, శుక్రవారం, 10 మార్చి 2017 (08:53 IST)
భవిష్యత్‌లో అణు యుద్ధాలు, జీవరసాయనిక దాడులు తప్పేలా లేవని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక రంగంలో మానవుడు అవలంభిస్తున్న చర్యల వల్ల ఈ తరహా యుద్ధాలు తప్పేలా కనిపించడం లేదన్నారు. 
 
ముఖ్యంగా గ్లోబెల్ వార్మింగ్ (భూతాపం) క్రమంగా పెరుగుతుండడం, భూమిపైన అనేక జాతులు అంతరించిపోవడం, ఆర్టిఫిషియల్ మేధస్సు ప్రపంచాన్ని వణికించడం.. వంటి భయాలు ఓపక్క ఉన్నప్పటికీ మానవ మనుగడకు వచ్చిన ముప్పేమీ ఉండదన్నారు. 
 
అయితే, భవిష్యత్తులో తలెత్తబోయే అణు, బయోలాజికల్ యుద్ధాల ముప్పును ‘వరల్డ్ గవర్నమెంట్’ మాత్రమే తప్పించగలదని, దానిని ఏర్పరచుకుంటే ఆ ముప్పును ముందుగానే గుర్తించే వీలుంటుందని హాకింగ్ సూచించారు. 
 
అదేసమయంలో ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరుతో పాటు... ప్రజల మధ్య ఈర్ష్యద్వేషాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా కూడా ఒక దేశం మరో దేశంపై అకారణంగా దాడి చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఇప్పటికే. కొరియా దేశాలతో పాటు.. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనివున్నాయని ఆయన గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి సర్వే రిజల్ట్స్.. పంజాబ్‌లో కాంగ్రెస్‌దే విజయం.. మరి ఉత్తరప్రదేశ్‌లో..