Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటిమీద నూలు పోగు లేకుండా రష్యన్ మహిళ వెరైటీ సన్ బాత్.. సోషల్ మీడియాలో వీడియో, ఫోటోలకు వైరల్!

సాధారణంగా సన్ బాత్ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలి.. సముద్రతీరానికో లేదా పార్క్ కో వెళుతుంటాం. కాని రష్యాకు చెందిన ఓ మహిళ మాత్రం వీటికి భిన్నంగా తన ఇంటి కిటికీనే సన్ బాత్‌కు తగిన స్థలంగా మార్చుకుంది. ఇందుల

ఒంటిమీద నూలు పోగు లేకుండా రష్యన్ మహిళ వెరైటీ సన్ బాత్.. సోషల్ మీడియాలో వీడియో, ఫోటోలకు వైరల్!
, గురువారం, 7 జులై 2016 (14:51 IST)
సాధారణంగా సన్ బాత్ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలి.. సముద్రతీరానికో లేదా పార్క్ కో వెళుతుంటాం. కాని రష్యాకు చెందిన ఓ మహిళ మాత్రం వీటికి భిన్నంగా తన ఇంటి కిటికీనే సన్ బాత్‌కు తగిన స్థలంగా మార్చుకుంది. ఇందులో ఏముంది విచిత్రం అనుకుంటున్నారా... ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా సన్ బాత్ చేస్తున్న ఆమె వాలకం చూడలేక ఇరుగుపొరుగు వాళ్లు ఇబ్బంది పడుతుంటే, సదరు మహిళ మాత్రం ఇదేమి పట్టనంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీంతో ఈ రష్యన్ మహిళ తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
 
ఇంతకీ అసలు విషయమేంటంటే..  రష్యాపట్టణం క్రోపోట్కిన్ వీధిలోని ఓ అపార్ట్‌మెంటు రెండో అంతస్తులో నివాసముండే ఓ మహిళ ఒంటిమీద దుస్తులు లేకుండా... తలభాగం మాత్రం లోపల, మిగిలిన శరీరభాగం కిటికీనుంచి బయటకు కనిపించేలా సన్ బాత్ చేస్తుంది. ఆమె చేస్తోన్న సన్‌బాత్‌ను కొంతమంది ఆసక్తిగా వీక్షిస్తుంటే, మరికొంతమంది మాత్రం ఏంటీ చోద్యం అంటూ మండిపడుతున్నారు. 
 
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకూ విండో సన్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆమె వ్యవహారాన్ని అక్కడి వాసులు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లలున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా... సదరు మహిళ ఎక్స్ పోజింగ్‌ను తట్టుకోలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఆమె విండో సన్‌బాత్‌ను ఎలాగైనా అడ్డుకోవాలంటూ... ఇరుగుపొరుగువారంతా సంతకాలు చేసిన ఓ పిటిషన్‌ను స్థానిక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటర్‌కు, పోలీసులకు ఇచ్చారు.
 
అయితే ఈ విషయంపై బిల్డింగ్ అధికారులతో పోలీసులు కూడా ఏమి చేయలేమని చేతులెత్తేయడంతో, సదరు మహిళ కిటికీ సన్‌బాత్ యథావిధిగా కొనసాగుతోంది. అంతేకాదు కేవలం కాళ్లు, నడుము భాగం మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు తన పైభాగాన్ని కూడా కిటికీలోంచి బయటకు పెట్టి సన్‌బాత్ చేస్తోందట. దీంతో కొందరు అటుగా వెళ్ళేవారు ఆమె ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో ఇప్పుడు రష్యన్ మహిళ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
అయితే ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లు సదరు మహిళ సన్ బాత్ మాత్రం తనకు ఇష్టం వచ్చినంతసేపు చేస్తోంది. ఈ ఫోటోపై వేలమంది షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆమె సన్ బాత్ విషయం స్థానికులను ఇబ్బంది పెట్టడమేకాక.. ఎప్పుడోప్పుడు విండోనుంచి పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాళహస్తిలో వెండి నాగపడగలను అమ్మేస్తున్నారు...!