Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ సింపుల్ బ్లడ్ టెస్టుతో సూసైడ్‌ను ముందే పసిగట్టవచ్చట!

ఓ సింపుల్ బ్లడ్ టెస్టుతో సూసైడ్‌ను ముందే పసిగట్టవచ్చట!
, బుధవారం, 30 జులై 2014 (14:00 IST)
ఇదేంటి అనుకుంటున్నారా ? నిజమేనండి.. ఓ సింపుల్ బ్లడ్ టెస్టుతో ఆత్మహత్యాయత్నాన్ని ముందే పసిగట్టవచ్చంటున్నారు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ పరిశోధకులు. ఒత్తిడి-ప్రతిచర్యలకు సంబంధించిన ఓ జన్యువు (ఎస్కేఏ2)లో జరిగే రసాయన మార్పును ఈ పరిశోధకులు గుర్తించారు. 
 
ఈ జన్యువులో కలిగే మార్పులే మనిషిలో ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలకు ముఖ్య కారణమవుతాయని తేల్చారు. శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో భాగంగా ఎస్కేఏ2 లో చోటుచేసుకున్న జన్యు ఉత్పరివర్తనంపై దృష్టి సారించారు. దీంతో, పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
 
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల మెదళ్ళలో లభ్యమైన శాంపిల్స్‌తో, ఈ ఎస్కేఏ2 జన్యువులో లభ్యమైన శాంపిళ్ళు సరిపోలాయట. ఇక, రక్త పరీక్ష ద్వారా ఈ జన్యువు తీరును గుర్తించవచ్చని, తద్వారా మనిషిలో ఆత్మహత్య ఆలోచనను నివారించేందుకు వీలుంటుందని ఈ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu