Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2018లో మే నెలలో భూమికి ముప్పు.. వరదలు, సునామీలు వస్తాయ్..

సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భూగోళంపై మానవజాతి మనుగడ మరో 600 సంవత్సరాలు మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం ప్రఖ్యాత ఫ్రెంచ్ భవిష్యద్ధర్శకుడు నోస్ట్రడామస్‌ చెప్పిన జ్యోతిష్యం నిజమయ్యే అవక

2018లో మే నెలలో భూమికి ముప్పు.. వరదలు, సునామీలు వస్తాయ్..
, మంగళవారం, 14 నవంబరు 2017 (12:37 IST)
సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భూగోళంపై మానవజాతి మనుగడ మరో 600 సంవత్సరాలు మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం ప్రఖ్యాత ఫ్రెంచ్ భవిష్యద్ధర్శకుడు నోస్ట్రడామస్‌ చెప్పిన జ్యోతిష్యం నిజమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం సరిగ్గా ఎనిమిదేళ్లపాటు అంటే 2025 వరకు కొనసాగుతుందని వారు అంచనా వేస్తున్నారు. తూర్పుదేశాలలో ఒక మహాభూకంపం సంభవిస్తుందని నోస్ట్రడామస్ వెల్లడించారు.
 
ఈ ప్రభావంతో భారీ సునామీ వస్తుందని, వరదలు ముంచెత్తుతాయని.. మానవుడు జీవించలేని పరిస్థితులు తలెతుత్తాయని ఓ వర్గం శాస్త్రవేత్తలు అంటున్నారు. మొత్తం మీద ప్రపంచం మీద ప్రకృతి కన్నెర్ర చేస్తుందని, సర్వవిధ్వంసం సృష్టిస్తుందని చెప్పుకొచ్చారు. 
 
చాలాకాలం క్రితం.. 2018 మే నెలలో భూమిని నిబురు అనే గ్రహమండల వ్యవస్థ ఢీకొంటుంది. దీని ప్రభావం భూగోళాన్ని అస్తవ్యస్థం చేస్తాయన్నారు. భూమిని నిబురు అనే గ్రహమండలం ఢీకొంటే.. దీనివల్ల భూగోళం అంతమయ్యే అవకాశం ఉందని డేనియల్ మాన్సన్ అనే శాస్త్రవేత్త చెప్తున్నారు. దానినే శాస్త్రవేత్తలు ఎక్స్ ప్లానెట్ గా పేర్కొంటున్నారని మాన్సన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు... ఇప్పటివరకు రూ.66074.55 కోట్లు