Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్‌ను ''టినీ ట్రంప్‌''గా మార్చేసిన ఆ వెబ్ సైట్.. సోషల్ మీడియాలో వైరల్

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‍పై ఎక్స్‌పరిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వలసదారులపై కన్నెర్ర చేయడంతో పాటు ఐటీకి గండికొట్టిన డొనాల్డ్ ట్రంప్‌పై రెడిట్ డాట్ కామ్ అనే వెబ్

ట్రంప్‌ను ''టినీ ట్రంప్‌''గా మార్చేసిన ఆ వెబ్ సైట్.. సోషల్ మీడియాలో  వైరల్
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (15:33 IST)
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‍పై ఎక్స్‌పరిమెంట్ ప్రస్తుతం సోషల్  మీడియాలో హల్ చల్ చేస్తోంది. వలసదారులపై కన్నెర్ర చేయడంతో పాటు ఐటీకి గండికొట్టిన డొనాల్డ్ ట్రంప్‌పై రెడిట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ కొత్త ప్రయోగానికి తెర తీసింది. మొత్తం ప్రపంచాన్ని పెద్దగా చేసి.. ట్రంప్‌ను టినీ ట్రంప్‌గా మార్చింది. ఈ ఎక్స్‌పరిమెంట్ చేసి గాల్లో వదిలేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
 
మెక్సికో బోర్డర్ వెంబడి గోడ కట్టేస్తాన్నన్న ట్రంప్ 'స్టైల్ ఆఫ్ థింకింగ్' మీద ప్రపంచవ్యాప్తంగా సెటైర్లే సెటైర్లు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌ను టినీ ట్రంప్‌గా మార్చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. 
 
ఇదిలా ఉంటే.. నైపుణ్యం గల వృత్తి నిపుణుల పట్ల ఆచి, తూచి దూరదృష్టితో వ్యవహరించాలని అమెరికాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం సుసంపన్నం కావడంలో భారతదేశ ప్రతిభావంతులు నిర్వహిస్తున్న పాత్రను గుర్తు చేశారు.
 
హెచ్ 1 బీ వీసాలను కుదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం చర్యలు చేపడుతున్న తరుణంలో మోడీ ఆ దేశ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు విధిస్తే భారత దేశంపై చెప్పుకోదగిన ప్రభావం పడుతోందన్న ఆందోళన లేకపోలేదు. అయితే ఈ ప్రోమోలను సదరు సంస్థ బ్లాక్ చేసేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెను పోగొట్టుకున్న తండ్రికి నరకం చూపిన వైద్యులు.. మోపెడ్‌పై శవం తరలింపు