Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ అన్నంత పనీ చేశారు....!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మాటకు కట్టుబడేవాడినేనని మరోసారి నిరూపించుకున్నారు. పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాల అభిమతాన్ని, ప్రయోజనాలను తోసిపుచ్చుతూ ట్రంప్ సోమవారం కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ

ట్రంప్ అన్నంత పనీ చేశారు....!
హైదరాబాద్ , మంగళవారం, 24 జనవరి 2017 (05:42 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మాటకు కట్టుబడేవాడినేనని మరోసారి నిరూపించుకున్నారు. పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాల అభిమతాన్ని, ప్రయోజనాలను తోసిపుచ్చుతూ ట్రంప్ సోమవారం కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య ఒప్పందం మసకబారిపోయింది.
 
ఎన్నికల హామీల్ని వరుసగా ఆచరణలోకి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ –పసిఫిక్‌ భాగస్వామ్య(టీపీపీ) ఒప్పందం నుంచి వైదొలుగుతూ సంతకం చేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో వాణిజ్య సహకారం కోసం పసిఫిక్‌ మహా సముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు 40 శాతం వాటా కలిగిఉన్నాయి.
 
ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమైన ట్రాన్స్ –పసిఫిక్‌ భాగస్వామ్య(టీపీపీ) ఒప్పందంపై ఏడేళ్ల పాటు సభ్య దేశాల మధ్య చర్చలు సాగాయి. 2016, ఫిబ్రవరి 4న తుది ఒప్పందంపై అమెరికాతో పాటు జపాన్ , మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, జపాన్ , పెరూ, సింగపూర్, బ్రూనై, చిలీలు సంతకం చేశాయి. ఒప్పందాన్ని ఆయా దేశాలు అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. ఆర్థిక సంబంధాల బలోపేతం, వృద్ధి రేటును ప్రోత్సహించడం, పన్నుల్ని తగ్గించడం ఈ ఒప్పందం లక్ష్యం.
 
అమెరికన్ కార్మికులకు, ఉత్పత్తిరంగానికి పశిఫిక్ వాణిజ్యం ఒప్పందం హానికరమని వాదించిన ట్రంప్ తన ఎన్నికర ప్రచార సమయంలోనే ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతామని ముందే హెచ్చరించారు. ఒబామా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ నేటికీ ఆమోదించలేదు కనుక అమెరికా ఆర్థిక పాలసీలపై ఇది తక్షణ ప్రభావం కలిగంచదు. కానీ ట్రంప్ హయాంలో అమెరికా వాణిజ్యం దృక్పథం పూర్తి భిన్నంగా ఉందని ట్రంప్ నిర్ణయం చెప్పకనే చెప్పింది. 
 
ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు సంతకం పెట్టిన అనతరం ట్రంప్ యూనియన్ లీడర్లు, బ్లూకాలర్ కార్మికులతో గంటలపాటు చర్చ జరిపడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పారం నింపితే ఇక ఫించను మాట మర్చిపోవాల్సిందే