Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరేంద్ర మోడీ కోసం గుజరాతీ భాషను నేర్చుకున్న బారక్ ఒబామా!

నరేంద్ర మోడీ కోసం గుజరాతీ భాషను నేర్చుకున్న బారక్ ఒబామా!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (09:38 IST)
అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీని పలుకరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా గుజరాతీ భాషను నేర్చుకున్నారు. సోమవారం మోడీకి ఇచ్చిన విందు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోడీతో భేటీ కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఒబామా, విందు సందర్భంగా మోడీని మంత్రముగ్ధుడిని చేశారు. మోడీని ఒబామా గుజరాతీ భాషలో పలుకరించారు. ‘‘కెమ్ ఛో (ఎలా ఉన్నారు)’’ అంటూ మోడీని పలుకరించిన ఒబామా అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఈ తరహాలో భారత ప్రధానిని పలకరించిన అమెరికా అధ్యక్షుడు దాదాపుగా ఇప్పటి వరకు లేరనే చెప్పొచ్చు. 
 
విందులో భాగంగా ఒబామాతో పాటు ఆ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ హాజరు కాగా, మోడీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి జై శంకర్ లు ఉన్నారు. విందు సందర్భంగా శ్వేత సౌధం ముందు ఏర్పాటు చేసిన భారతీయ సంప్రదాయ నృత్యరూపకం ‘‘గర్భా’’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu