Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేపాల్ భూప్రకోప మృతులు 3729 : 20 అణు బాంబులతో సమానమట!

నేపాల్ భూప్రకోప మృతులు 3729 : 20 అణు బాంబులతో సమానమట!
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:49 IST)
నేపాల్‌ను మరుభూమిగా మార్చిన భూప్రకోపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ మృతుల సంఖ్య 3729గా నేపాల్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయని తెలిపింది. అందువల్ల కూలిన భవనాల శిథిలాలను తొలగించే కొద్దీ ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
మరోవైపు.. మూడు రోజుల క్రితం సంభవించిన ఈ భూకంపం అన్ని ప్రపంచ దేశాలను కలచివేసింది. ఏళ్లుగా నేపాల్‌ను ఎన్నో భూకంపాలు కుదిపేస్తున్నా, తాజా ఉపద్రవం మాత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఎవరెస్ట్ అంతటి సమున్నత శిఖరరాజం కూడా ఈ భూకంపం ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. 
 
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదైంది. నేపాల్ గడ్డపై గత 80 ఏళ్లలో ఇదే అతి భారీ భూకంపం. ఇది 20 థర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబులకు సమానమని పరిశోధకులు అంటున్నారు. భూమికి 10 నుంచి 15 కిలోమీటర్ల లోతులోనే భూకంపం సంభవించడంతో తీవ్రత ఎక్కువగా కనిపించిందని తెలిపారు. అందుకే భూమి కుదుపులు వేగంగా చోటుచేసుకున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu