Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిడ్డకు తండ్రి కాదు పొమ్మన్న బాయ్ ఫ్రెండ్.. ఆన్‌లైన్‌లో కన్నబిడ్డ అమ్మకానికి.. ఆ తర్వాత?!

బిడ్డకు తండ్రి కాదు పొమ్మన్న బాయ్ ఫ్రెండ్.. ఆన్‌లైన్‌లో కన్నబిడ్డ అమ్మకానికి.. ఆ తర్వాత?!
, గురువారం, 5 మే 2016 (18:24 IST)
కన్నబిడ్డను అమ్మేయడం.. పిల్లలు అల్లరి చేస్తుంటే తీవ్రంగా శిక్షించడం విదేశాల్లో ఫ్యాషనైపోయింది. తాజాగా కన్నబిడ్డను ఆన్‌లైన్‌లో పెట్టి ఓ తల్లి అడ్డంగా బుక్కైన ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే 20 ఏళ్ల మహిళ గత ఏడాది ఓ వెబ్‌సైట్లో తన 19 నెలల బిడ్డను 340 డాలర్లకు అమ్మకానికి పెట్టేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో కోర్టు ఆ మహిళకు మూడేళ్ల పాటు గృహనిర్భంధం విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో గతంలో విధించిన ఐదేళ్ల జైలు శిక్షను నిలిపేసింది. 
 
ఆన్‌లైన్‌లో 20 ఏళ్ల మహిళ బిడ్డను అమ్మకానికి పెట్టేయడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. మెడికల్ రిపోర్టులో ఆ బిడ్డకు తండ్రి తాను కాదని తేలడంతో తన బాయ్‌ఫ్రెండ్ చిన్నారి సంరక్షణకు డబ్బివ్వలేదని.. అందుకే బాబును అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందని ఆ మహిళ వెల్లడించింది. దీంతో ఆమెకు బాలుడి అక్రమ రవాణా కాదని తెలుసుకున్న కోర్టు మూడేళ్ల పాటు గృహ నిర్భంధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వెంకయ్య, జైట్లీ రాజీనామా చేయాలి.. 'గాలి' వ్యాఖ్యలు