Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలుడిపై పందులు దాడి... మృతి... పందులకు మరణ శిక్ష

బాలుడిపై పందులు దాడి... మృతి... పందులకు మరణ శిక్ష
, గురువారం, 30 అక్టోబరు 2014 (13:18 IST)
తప్పు చేస్తే... అది హత్యలు వంటి వాటికి పాల్పడితే మనుషులకు మరణ దండనలు విధించడం మనకు తెలిసిన విషయమే. 15వ శతాబ్దంలో తప్పు చేసిన జంతువులను కూడా శిక్షించేవారని పరిశోధకులు పేర్కొంటున్నారు. అప్పట్లో ఫ్రాన్స్ దేశంలో జంతువులను కూడా మనుషుల్లానే భావించి నేరం చేసిన జంతువులను బంధించి విచారించి శిక్ష విధించి అమలు జరిపేవారట.
 
దీనికి ఓ ఉదాహరణను కూడా ఉటంకించారు. అదేమిటంటే... ఫ్రాన్స్ లోని సావిగ్నీ అనే గ్రామంలో ఆరు పందులు ఐదేళ్ల బాలుడిపై దాడిచేసి అతడి మృతికి కారణమయ్యాయి. ఈ దుర్ఘటన తెలుసుకున్న భద్రతా సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
 
బాలుడి మృతికి ఆ ఆరు పందులు కారణమని నేరం నిర్థారణ కావడంతో వాటికి మరణశిక్ష విధించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు వాటికి మరణ దండన విధించారు. ఇలాంటి మరణ శిక్షలు కేవలం పందులకే కాదు... అప్పట్లో కుక్కలు, ఏనుగులు... ఇతర జంతువులకు నేర స్థాయిని బట్టి శిక్షలు విధించేవారట.

Share this Story:

Follow Webdunia telugu