Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించండి.. సార్క్‌కు వచ్చేది లేదన్న బంగ్లాదేశ్: సింధు జలాలపై ''ముష్'' ఏమన్నారు?

పాకిస్థాన్ ఏకాకి కానుందా? దాయాది దేశమైన భారత్‌ యుద్ధం ప్రకటిస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కాశ్మీర్ సమస్యతో పాటు భారత్‌పై దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకున

పాక్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించండి.. సార్క్‌కు వచ్చేది లేదన్న బంగ్లాదేశ్: సింధు జలాలపై ''ముష్'' ఏమన్నారు?
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (16:49 IST)
పాకిస్థాన్ ఏకాకి కానుందా? దాయాది దేశమైన భారత్‌ యుద్ధం ప్రకటిస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కాశ్మీర్ సమస్యతో పాటు భారత్‌పై దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకునే పాకిస్థాన్‌కు గండికొట్టేందుకు ప్రపంచ దేశాలు సంసిద్ధమవుతున్నాయి. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి పొరుగుదేశమైన బంగ్లాదేశ్ కూడా విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం సంచలనమైంది.
 
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నవంబరులో జరిగే సార్క్ సమావేశాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలు హాజరు కాబోవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మౌజెమ్ అలీ మాట్లాడుతూ.. సార్క్ సమావేశాలకు హాజరుకాబోమని నాలుగు దేశాలు నిరాకరించడం తీవ్రమైన అంశమన్నారు. 
 
ఈ విషయాన్ని గుర్తించాలని ఐరాసను కోరినట్లు వెల్లడించారు. ఇంకా అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను ఏకాకి చేయాలని, విదేశీ పాలసీల విషయంలో పాకిస్థాన్‌ ఏవిధంగా ముందుకెళ్లాలనుకుంటుందో ఆ దేశ సర్కారు విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నప్పటికీ.. ఆ దేశ నేతల మాటలు రోజు రోజుకీ పదునెక్కుతున్నాయి. యూరీ ఘటనకు అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత్ నిర్ణయించుకున్న నేపథ్యంలో.. సింధు జలాల వ్యవహారంపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మళ్లీ నోరుపారేసుకున్నారు. కార్గిల్ వార్‌కు కారణమైన ముషారఫ్.. సింధు జలాలను భారత్ అడ్డుకుంటే పాకిస్థాన్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 
 
అయితే భారత్‌తో తలపడేందుకు సిద్ధపడట్లేదని, శాంతి ప్రక్రియ ద్వారానే కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. సింధు జలాలపై భారత్-పాకిస్థాన్‌లో మధ్య వివాదం ముదురుతుందన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని ముషారఫ్ వ్యాఖ్యానించారు.  భారత్ ప్రభావితం చేయడం వల్లే సార్క్ సదస్సుకు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ రావట్లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికులను డబ్బులివ్వమన్నారు.. ఫోన్లు చేసి వేధించారు.. అడ్డంగా బుక్కైన కానిస్టేబుళ్లు..