Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో పదేళ్లలో అత్యధిక అణుబాంబుల్ని కలిగివున్న దేశంగా పాకిస్థాన్!

మరో పదేళ్లలో అత్యధిక అణుబాంబుల్ని కలిగివున్న దేశంగా పాకిస్థాన్!
, శుక్రవారం, 28 ఆగస్టు 2015 (11:34 IST)
మరో పదేళ్లలో అమెరికా, రాష్యా తర్వాత అత్యధిక అణుబాంబుల్ని కలిగివున్న దేశంగా పాకిస్థాన్ నిలుస్తుందని, పొరుగున ఉన్న భారత్ అంటే భయపడుతున్న పాకిస్థాన్.. భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి ప్రణాళికలు రూపొందించిందని 'వాషింగ్టన్ పోస్ట్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
 
సాలీనా 20 అణుబాంబులను తయారు చేసి దాచుకుంటున్న పాకిస్థాన్, వచ్చేపదేళ్లలో వేలకొద్ది బాంబులు ఒకేసారి వేస్తే వచ్చేంత శక్తితో కూడుకున్న 350 అణు ఆయుధాలను తయారు చేయనుందని వివరించింది. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక అణుబాంబులున్న దేశాల్లో పాకిస్థాన్ టాప్-3లో నిలవనుందని అంచనా వేసింది.
 
"ఇండియా పేరు వింటేనే చాలు భయపడుతున్న పాకిస్థాన్ శరవేగంగా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది" అంటూ కార్నేజ్ ఎండోమెంట్స్ న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్ కో-డైరెక్టర్ టోబీ డాల్టన్, స్టిమ్సన్ సెంటర్ సహ వ్యవస్థాపకులు మైఖేల్ క్రిపాన్‌లు ఓ స్పెషల్ స్టోరీ రాశారు.

Share this Story:

Follow Webdunia telugu