Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందూ దేవాలయాన్ని ఎందుకు కూల్చారు.. పునర్‌నిర్మించండి : సుప్రీంకోర్టు

హిందూ దేవాలయాన్ని ఎందుకు కూల్చారు.. పునర్‌నిర్మించండి : సుప్రీంకోర్టు
, బుధవారం, 26 ఆగస్టు 2015 (13:07 IST)
పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆ దేశ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కరాక్ జిల్లాలోని హిందూ దేవాలయాన్ని ఎందుకు కూల్చివేశారంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని నిలదీశింది. అంతేకాకుండా, ఈ దేవాలయాన్ని తక్షణం పునర్‌నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ జవాద్ ఎస్ ఖావాజా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పించ్చిందని 'డాన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
హోం శాఖ కార్యదర్శి అరబ్ మహమ్మద్ ఆరిఫ్, పీఎంఎల్-ఎన్ ఎంఎన్ఎ పార్టీ నేత రమేష్ కుమార్ వాంక్వానీ, కరాక్ డిప్యూటీ కమిషనర్ షోయబ్ జాదూన్‌లు కలసి చర్చించి శ్రీ పరమహంస జీ మహరాజ్ దేవాలయాన్ని తిరిగి కట్టే విషయమై ఓ నిర్ణయానికి రావాలని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో దేవాలయం తిరిగి కట్టాలని తేల్చింది. గతంలో లాహోర్ మార్కెట్లో చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతినకుండా దేవాలయాన్ని పునర్నిర్మించిన ఆర్కిటెక్చర్ కమిల్ ఖాన్ సలహాలు తీసుకోవాలని సూచిస్తూ.. ఈ కేసు విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu