మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించి ఓ ప్రశ్న సంధించిన మహిళా జర్నలిస్టును చూసి పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కన్నుకొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. దేశం ఒక మీమ్‍గా మారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. కెమెరాల ముందే ఇలా జరుగుతుంటే.. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు ఈ విలేకరుల సమావేశంలో ఏం జరిగిందంటే... మహిళా జర్నలిస్ట్ అబ్బా కోమన్... 'ఇమ్రాన్ ఖాన్‌ను దేశ భద్రతకు ముప్పుగా, దేశ వ్యతిరేకిగా, ఢిల్లీ చేతిలో పని చేస్తున్న వ్యక్తిగా ఆరోపణలు చేస్తున్నారు. గతానికి, ఇప్పటికీ తేడా ఏంటి? అని ప్రశ్నించారు. దీనికి చౌదరి బదులిస్తూ మీరు చెప్పిన మూడు పాయింట్లకు నాలుగోది కూడా చేర్చండి... ఆయన ఓ జెహ్నీ మరీజ్ (మానసిక రోగి) కూడా అంటూ వ్యాఖ్యానిస్తూ ఆమెవైపు చూసి కన్నుగీటి నవ్వారు. ఆయన చేష్టలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు షోషల్ మీడియాో వైర