Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయపాటి‌కి వైట్ హౌస్‌ ఆహ్వానం: ఒబామా దంపతులకు లడ్డూ, హారం..

రాయపాటి‌కి వైట్ హౌస్‌ ఆహ్వానం: ఒబామా దంపతులకు లడ్డూ, హారం..
, మంగళవారం, 27 జనవరి 2015 (13:01 IST)
నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావును అమెరికా వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా అమెరికా చీఫ్ బరాక్ ఒబామా ఆహ్వానించారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాయపాటి సాంబశివరావు.. బరాక్ ఒబామాను కలిసి తిరుపతి లడ్డూ ప్రసాదం అందించారు.

ప్రత్యేకంగా తయారు చేసిన శాలువాను బహుకరించారు. బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామాకు అపురూపమైన ముత్యాల హారాన్ని అందించారు.
 
ఈ సందర్భంగా ఒబామా దంపతులు రాయపాటి సాంబశివరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక వైట్‌హౌజ్‌కు వచ్చి తమ ఆతిథ్యం అందుకోవాలని రాయపాటిని ఒబామా ఆహ్వానించారు. 
 
2010లో భారత్‌లో పర్యటించిన సమయంలోనూ బరాక్ ఒబామాకు బంగారంతో తయారు చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని రాయపాటి సాంబశివరావు బహుకరించారు.
 
కాగా, పాత పరిచయంతోనే ఒబామా తన తాజా పర్యటనలో రాయపాటిని గుర్తుంచుకుని స్వయంగా పలకరించారు. తనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి వ్యక్తిగతంగా ఆహ్వానం రావడం ఎంతో సంతోషంగా ఉందని రాయపాటి సాంబశివరావు తెలిపారు. 
 
తాను చాలా సార్లు అమెరికా వెళ్లానని, అయితే తన తదుపరి అమెరికా పర్యటన మాత్రం ప్రత్యేకంగా ఉండనుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu