Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా మెడపై కత్తి పెడితే సహించం.. అమెరికా మెడలువంచేందుకే క్షిపణి పరీక్షలు : ఉత్తర కొరియా

మా మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని అమెరికాకు ఉత్తర కొరియా తేల్చి చెప్పింది. అంతేకాదండోయ్.. ప్రపంచ పెద్దన్న పాత్రను పోషిస్తున్న అమెరికా మెడలు వంచేందుకే తాము వరుస క్షిపణి పరీక్షల

మా మెడపై కత్తి పెడితే సహించం.. అమెరికా మెడలువంచేందుకే క్షిపణి పరీక్షలు : ఉత్తర కొరియా
, శనివారం, 25 జూన్ 2016 (15:11 IST)
మా మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని అమెరికాకు ఉత్తర కొరియా తేల్చి చెప్పింది. అంతేకాదండోయ్.. ప్రపంచ పెద్దన్న పాత్రను పోషిస్తున్న అమెరికా మెడలు వంచేందుకే తాము వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. 
 
ఇదే అంశంపై ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అమెరికా వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ హాన్ సోంగ్ ర్యోల్ అమెరికా పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అమెరికా పట్ల తమ దేశ వైఖరిని తేటతెల్లం చేశారు. 
 
అదేసమయంలో తమ దేశాన్ని అణు సామర్థ్యంగల దేశంగా పరిగణించవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికైనా అమెరికా వైఖరి మారకపోతే మరిన్ని అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. తమ దేశం అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు చేయడానికి కారణం అమెరికా ఒత్తిళ్ళేనన్నారు. సైనిక బెదిరింపులు, ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ళను అమెరికా ఆపాలని డిమాండ్ చేశారు. 
 
ఉత్తర కొరియా బుధవారం రెండు మధ్యంతర స్థాయి క్షిపణుల పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. వీటిని సమర్థించుకున్న ఆయన.. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా విమర్శలను తిప్పికొట్టారు. సైనిక నిరోధాన్ని నిర్మించుకోవడం మినహా తమకు మరో దారి లేదన్నారు. అమెరికా ఇటీవలే అణ్వస్త్ర సామర్థ్యంగల జలాంతర్గాములను, బాంబర్లను ఉత్తర కొరియా ప్రాంతంలో మోహరించిందని ఆయన ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌తంజ‌లి ప్రొడ‌క్ట్స్ 'మాయ‌'... 2016 అక్టోబరు తయారు చేశారట... ముందుగానే మార్కెట్లోకి... ఎలాగబ్బా?