Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాగీ ప్యాంట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? అండర్‌వేర్ కంటే కాస్త కిందికి ఉండి..?!

శాగీ ప్యాంట్స్‌... నడుం కిందకులో దుస్తులు కొంచెం కనిపించేలా ధరించేదే ఈ శ్యాగీ ప్యాంట్‌. చాలామందికి ఈ ప్యాంట్ గురించి తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో నడుం కిందుగా ధరించిన ప్యాంట్‌ను చ

శాగీ ప్యాంట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? అండర్‌వేర్ కంటే కాస్త కిందికి ఉండి..?!
, శనివారం, 9 జులై 2016 (09:45 IST)
శాగీ ప్యాంట్స్‌... నడుం కిందకులో దుస్తులు కొంచెం కనిపించేలా ధరించేదే ఈ శ్యాగీ ప్యాంట్‌. చాలామందికి ఈ ప్యాంట్ గురించి తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో నడుం కిందుగా ధరించిన ప్యాంట్‌ను చూశారా అదే ఈ శాగీ ప్యాంట్‌. ఇప్పుడు శ్యాగీ ప్యాంట్‌కు కుర్రకారు మధ్యలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ప్యాంట్ల గురించి తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 
 
ఈ ప్యాంట్లు ధరించేందుకు యువకులు అమితోత్సాహం చూపుతున్నారు. అండర్‌వేర్ కంటే కాస్త కిందికి ఉండి చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ ప్యాంట్లపై అమెరికా సౌత్ కరోలినాలోని చిన్న పట్టణమైన టిమ్మొన్సివిల్లే నిషేధం విధించింది. శ్యాగీ ప్యాంట్లు ట్రౌజర్లు, షార్టులు ధరించడాన్నిఆ పట్టణంలో నిషేధించబడింది. లోదుస్తులు కనిపించేలా ఇటువంటి దుస్తులు ధరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఉపక్రమించింది. 
 
నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు తప్పవు. సుమారు వంద డాలర్ల నుంచి 600 డాలర్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పట్టణ అధికారి మేరీ బినెస్ మాట్లాడుతూ.. న్యూడిటీని కూడా ఈ ఆర్డినెన్స్ ద్వారా నిషేధించినట్టు పేర్కొన్నారు. పట్టణ కౌన్సిల్ 5-1 తేడాతో ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్టు తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి శ్యాగీ ప్యాంట్లు ధరించినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతులు డ్యాన్స్ చేస్తుంటే.. ఓ ఎస్సై వారిని కళ్లార్పకుండా అదేపనిగా చూస్తుండిపోయాడు...!