Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో విషాదం: ఇన్‌స్ట్రక్టర్‌నే కాల్చేసిన బాలిక! (వీడియో)

అమెరికాలో విషాదం: ఇన్‌స్ట్రక్టర్‌నే కాల్చేసిన బాలిక! (వీడియో)
, బుధవారం, 27 ఆగస్టు 2014 (18:59 IST)
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొరపాటున తన షూటింగ్ ఇన్‌స్ట్రక్టర్‌నే 9 ఏళ్ల బాలిక కాల్చేసింది. దీంతో, ఇన్‌స్ట్రక్టర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఆరిజోనాలో చార్లెస్ వకా (39) ఓ షూటింగ్ ఇన్‌స్ట్రక్టర్.
 
అయితే, వైట్ హిల్స్ రేంజిలో తన శిష్యురాలికి హై పవర్ సబ్ మెషీన్ గన్ పేల్చడమెలాగో నేర్పిస్తుండగా, ఆ బాలిక తుపాకీపై నియంత్రణ కోల్పోయింది. దీంతో, తుపాకీ పేలగా బుల్లెట్ వకా తలలోకి దూసుకుపోయింది. అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా లాస్ వేగాస్ తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది.
 
కాగా, సదరు బాలిక తల్లిదండ్రులు కూడా షూటింగ్ రేంజి వద్దే ఉన్నారు. తమ కుమార్తె షూటింగ్ నేర్చుకుంటుండడాన్ని వారు వీడియోలో చిత్రీకరించారు. దాంతో, ఈ ఘటన కూడా కెమెరాకు చిక్కింది. 

Share this Story:

Follow Webdunia telugu