Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాక్ సింగర్‌తో శృంగారం చేస్తున్నట్టు ఫోటోలు.. మైనపు బొమ్మకు మరింత భద్రత...

రాక్ సింగర్‌తో శృంగారం చేస్తున్నట్టు ఫోటోలు..  మైనపు బొమ్మకు మరింత భద్రత...
, సోమవారం, 31 ఆగస్టు 2015 (14:33 IST)
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్‌లో కొలువు దీరి ఉన్నాయి. ఇందులో ఇటీవల ప్రముఖ రాక్ సింగర్ నిక్కి మినాజ్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. అయితే చూసేందుకు సెక్సీగా కనిపించే ఆ బొమ్మతో శృంగారం చేస్తున్నట్టు పలువురు ఫోటోలు తీస్తుండడంతో దిగ్భ్రాంతి చెందిన నిర్వాహకులు ఆ బొమ్మకు అదనపు భద్రత ఏర్పాటు చేశారు. 

అనకొండా అనే ఆల్బమ్ ఆధారంగా నిక్కి మినాజ్ మైనపు బొమ్మను రూపొందించారు. మోకాళ్లపై చేతులు నేలకు ఆన్చి వంగి ఉన్న భంగిమంలో ఈ మైనపు బొమ్మ కనిపిస్తుంది. దీంతో ఈ బొమ్మను ఫోటోలు తీసే కొందరు, నిక్కి‌తో సెక్స్ చేస్తున్నట్టు అసభ్యకోణంలో ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన మ్యూజియమ్ నిర్వహాకులు ఆ బొమ్మకు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా మ్యూజియమ్ నిర్వాహకులు మాట్లాడుతూ..  తమ మ్యూజియమ్‌లో ఉన్న మైనపు బొమ్మలను గౌరవించాలని అన్నారు. ఇక్కడ ఉన్న బొమ్మలు అన్ని పలు రంగాలలో రికార్డులు సాధించిన వారివేనని తెలిపారు. అత్యంత సెక్సీగా కనిపించే నిక్కి మినాజ్ మైనపు బొమ్మ భంగిమను మార్చాలని నిర్ణయించామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu