Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రోనాట్‌లకు కొత్తతరం బ్రేక్ ఫాస్ట్ బార్‌లు! 700-800 క్యాలరీల శక్తి!

ఆస్ట్రోనాట్‌లకు కొత్తతరం బ్రేక్ ఫాస్ట్ బార్‌లు! 700-800 క్యాలరీల శక్తి!
, బుధవారం, 26 నవంబరు 2014 (18:29 IST)
ఆస్ట్రోనాట్‌లకు కొత్తతరం బ్రేక్ ఫాస్ట్ బార్ల తయారు చేయాలని నాసా భావిస్తోంది. అంతరిక్షంలో నెలల తరబడి పరిశోధనల్లో మునిగితేలే ఆస్ట్రోనాట్‌లకు ఉపయోగపడేలా కొత్తరకం బ్రేక్ ఫాస్ట్ బార్‌లను తయారు చేసే పనిలో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం 'నాసా' నిమగ్నమైంది. ఈ మేరకు ఒక్క బార్ తింటే 700 నుంచి 800 క్యాలరీల శక్తి వస్తుందని డిస్కవరీ న్యూస్ పేర్కొంది. 
 
సాధారణంగా స్పేస్ స్టేషన్‌లో ఉండే వ్యోమగాములకు రోజుకు 3 వేల క్యాలరీల శక్తి అవసరం. భూమికి దాదాపు 260 మైళ్ళపైన ఉండే కక్ష్యలోని స్పేస్ స్టేషన్ ఆస్ట్రోనాట్‌లకు కావాల్సిన గుడ్లు, బ్రెడ్‌లు, డ్రింక్స్ తదితరాలను కార్గో షిప్‌లు చేరవేస్తుంటాయి. 
 
వీటి నిర్వహణ భారం అవుతున్న నేపథ్యంలో, నాసా బ్రేక్ ఫాస్ట్ బార్‌ల తయారీకి సంకల్పించింది. ఇందులో నాసా శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే, ఒక్క అల్పాహార గుళికతో 6 ఫుడ్ పాకెట్ల మేర బరువును తగ్గించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu