Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అమీర్ ఖాన్ ధూమ్-3

చైనాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అమీర్ ఖాన్ ధూమ్-3
, గురువారం, 31 జులై 2014 (15:01 IST)
చైనాలో అమీర్ ఖాన్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అమీర్ ఖాన్ ప్రతినాయక పాత్రలో నటించిన ధూమ్-3 సినిమా 400 ప్రాంతాల్లో 2000 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలైంది. చైనాలో అపూర్వ ఆదరణ పొందుతున్న ఈ సినిమా అక్కడి టాప్ టెన్ మూవీ చార్ట్‌లో తొమ్మిదో స్థానం సంపాదించడం విశేషం.
 
యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సీక్వెల్ టర్కీలోనూ ప్రభంజనం సృష్టించింది. అక్కడి టాప్ టెన్ మూవీ చార్ట్‌లో స్థానం సంపాదించిన తొలి భారత సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇక, చైనాలో ఇంత భారీ స్థాయిలో రిలీజైన భారత సినిమా ఇదే కావడం గమనార్హం. 
 
చైనా రొమాంటిక్ మూవీ 'ను జువో నో డై' కూడా ధూమ్-3 ధాటికి వెనకబడిపోయిందట. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రీనా కైఫ్, ఉదయ్ చోప్రా నటించారు.

Share this Story:

Follow Webdunia telugu