Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడు బిచ్చగాడు కాదు... కోటీశ్వరుడు!!

ఆడు బిచ్చగాడు కాదు... కోటీశ్వరుడు!!
, శుక్రవారం, 25 జులై 2014 (13:35 IST)
ఆడు బిచ్చగాడు అంటే పొరపాటే.. అతనో కోటీశ్వరుడు అంటే నమ్ముతారా నమ్మితీరాల్సిందే. యాచకుడి అవతారంలో భిక్షగాడిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అరబ్‌లో భిక్షమెత్తుతున్న ఒక అరబ్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను కోటీశ్వరుడని తెలియడంతో కళ్లు బైర్లు కమ్మాయి. యాచకుడి అవతారంలో ఉన్న అతగాడు దాదాపు 3 లక్షల అమెరికన్ డాలర్ల ఆస్తిపరుడని అధికారుల దర్యాప్తులో తేలింది.
 
సౌదీ అరేబియాలో భిక్షాటన నిషిద్ధం. అయితే చట్టవిరుద్ధంగా భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని అతడిని సోదా చేయగా నగదుతోపాటు 12 లక్షల సౌదీ రియల్స్ అతని ఇంట్లో లభించాయి. ఒక గల్ఫ్ దేశం నుంచి పెట్టుబడిదారు లైసెన్సు కూడా అతగాడు పొందినట్లు బయటపడింది. ఆ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా సౌదీలో చట్టవిరుద్ధంగా విలాసవంతంగా నివసిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu