Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌తో చిన్న చిన్న యుద్ధాలు తప్పవ్.. సైన్యం సిద్ధంగా ఉండాలి: దల్బీర్ సింగ్

పాక్‌తో చిన్న చిన్న యుద్ధాలు తప్పవ్.. సైన్యం సిద్ధంగా ఉండాలి: దల్బీర్ సింగ్
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:04 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌తో చిన్న చిన్న యుద్ధాలు చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొందని.. అందుచేత సైన్యం అనునిత్యమూ సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ హెచ్చరించారు.

సరిహద్దుల్లో నిత్యమూ కాల్పుల విరమణకు పాకిస్థాన్ తూట్లు పొడుస్తుందని దల్బీర్ సింగ్ గుర్తు చేశారు. జమ్ముకాశ్మీర్‌లో వారు కొత్త పద్ధతులతో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని దల్బీర్ సింగ్ ఆరోపించారు. 
 
పాకిస్థాన్ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 245సార్లు పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయని వెల్లడించారు. గతంలో భారత సైన్యం ఉన్న శిబిరాలపై కాల్పులు జరిగేవని, ఇప్పుడు సామాన్యులు లక్ష్యంగా పాకిస్థాన్ కాల్పులు జరుగుతున్నాయని దల్బీర్ సింగ్ తెలిపారు. 
 
గతవారంలో ఇండియా, పాక్ మధ్య చర్చలు విఫలమైన తరువాత గ్రామాలపై కాల్పులు జరిపి ఇద్దరు మహిళలను బలి చేశారని, 22 మందికి తూటాల గాయాలయ్యాయనే విషయాన్ని గుర్తు చేశారు. పాక్ దురాగతాలను గట్టిగా తిప్పికొడతామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu