Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాయిలెట్ నీటితో ఐస్ బకెట్ చాలెంజ్: మాట్ డామన్ వెరైటీ! (వీడియో)

టాయిలెట్ నీటితో ఐస్ బకెట్ చాలెంజ్: మాట్ డామన్ వెరైటీ! (వీడియో)
, బుధవారం, 27 ఆగస్టు 2014 (18:51 IST)
హాలీవుడ్ హీరో, బోర్న్ ఐడెంటిటీ ఫేమ్ మాట్ డామన్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను వెరైటీగా స్వీకరించాడు. మంచి నీటి ఆదా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే డామన్ ఐస్ బకెట్ ఛాలెంజ్ పేరిట మంచి వాడకంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని, అనేక పేద దేశాల్లో మంచి నీరు విలువైన వస్తువుగా పరిగణించబడుతోందని తెలిపిన ఆయన, టాయిలెట్ నీటి ద్వారా ఐస్ బకెట్ ఛాలెంజ్ విసిరారు. 
 
పలు టాయిలెట్ల నుంచి సేకరించిన నీటిని తనపై కుమ్మరించుకుని ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను తన సహచర నటుడు జార్జ్ క్లూనీ, సంగీత దర్శకుడు బానో, అమెరికన్ ఫుట్ బాలర్ టామ్ బ్రాడీలకు సవాల్ విసిరి ఆదర్శంగా నిలిచాడు. 
 
ఏదిఏమైనా టాయిలెట్ నీళ్లను కుమ్మరించుకున్న డామన్.. మళ్లీ స్నానానికి మంచినీటిని ఉపయోగించక తప్పదు కదా..!

 

Share this Story:

Follow Webdunia telugu