Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూతుర్ని రేప్ చేయమని అమ్మ ఆన్‌లైన్లో ప్రకటన: రేప్ చేస్తుండగా పక్కనే ఉండి చూస్తూ..?!

కూతుర్ని రేప్ చేయమని అమ్మ ఆన్‌లైన్లో ప్రకటన: రేప్ చేస్తుండగా పక్కనే ఉండి చూస్తూ..?!
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (13:14 IST)
అమ్మతనానికే ఆ మహిళ మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. తన ఆరేళ్ల కూతుర్ని అత్యాచారం చేయండంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చింది. అంతేగాకుండా ఆరేళ్ల కూతురిపైన అత్యాచారం చేయించి జైలు పాలైంది. ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు 26 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన 35 ఏళ్ల తల్లి డబ్బు చెల్లించేవారు ఎవరైనా సరే తన కూతుర్ని అనుభవించేందుకు రావొచ్చని ఆన్‌లైన్లో ప్రకటనలు చేసింది. అంతటితో ఆగకుండా కూతురుపై దారుణంగా అత్యాచారం చేయించి ఫోటోలు, వీడియోలో తీయించింది. ఈ విషయం చివరకు పోలీసులకు తెలియరావడంతో.. ఆ మహిళ ఇంట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 
 
ఈ తనిఖీల్లో ఎన్నో అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు, ఆ బాలికపై లైంగిక దాడి జరుగుతుండగా ఆమె పక్కనే ఉండి చూస్తున్నట్లు ఉన్న వీడియోల్ని సొంతం చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. విచారణలో కూతురిపై లైంగిక దాడి జరపించడమే కాకుండా గతంలో 12లైంగిక నేరాలకు పాల్పడిందని తేలింది.

ఆమె భర్తకు కూడా ఇలాంటి నేరాల కింద 27 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఇక బాధిత బాలిక, ఆమె సోదరుడిని బాలబాలికల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu