Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంటిపై 11 లక్షల తేనెటీగలతో... చైనా వ్యక్తి సరికొత్త రికార్డ్..

ఒంటిపై 11 లక్షల తేనెటీగలతో... చైనా వ్యక్తి సరికొత్త రికార్డ్..
, బుధవారం, 27 మే 2015 (18:05 IST)
చైనా దేశంలోని టాయ్‌యన్ నగరానికి చెందిన వ్యక్తి గావో బింగ్‌గువో (55) శరీరంపై 11 లక్షల తేనెటీగలతో సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు. తేనె అమ్ముకునే గావో తేనె టీగలతో సాహస కార్యక్రమం చేశాడు. గావో తన ఒంటిపైకి ఒక్కసారిగా దాదాపు 11 లక్షల తేనెటీగలను ఆకర్షించాడు. వీటి బరువు 109 కిలోలు. దీంతో గతంలో ఉన్న రికార్డు (85 కిలోలు బరువు)ను గావో బద్దలుకొట్టాడు.
 
ఆ సమయంలో గావో లోదుస్తులు మాత్రమే ధరించాడు. మొదట కొన్ని వందల తేనెటీగలు మాత్రమై ఆయన శరీరంపై వాలాయి. ఆ తర్వాత లక్షలాది తేనెటీగలు వచ్చి ఆయన ఒంటిపై చేరాయి. అయితే గావో తన పెదవులపైకి తేనెటీగలు రాకుండా ఉండేందుకు సిగరెట్ వెలిగించుకున్నాడు. ఈ సాహసం చేసే క్రమంలో ఆయన శరరీ ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగింది. అయినా పట్టుదలతో రికార్డు సృష్టించాడు. అన్నట్టు గావో 35 ఏళ్లకుపైగా తేనెటీగలను సంరక్షిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu