Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలాలాపై దాడి చేసిన 10 మంది టెర్రరిస్టులు అరెస్ట్!

మలాలాపై దాడి చేసిన 10 మంది టెర్రరిస్టులు అరెస్ట్!
, శనివారం, 13 సెప్టెంబరు 2014 (18:02 IST)
బాలికల విద్యాహక్కు ఉద్యమకారిణి, పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్‌పై దాడి చేసిన 10 మంది తాలిబన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసులు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మేజనర్ జనరల్ అసీం సలీమ్ బాజ్వా చెప్పారు.  
 
2012 అక్టోబర్‌లో వాయువ్య స్వాత్‌ లోయలో మలాలపై తెహ్రీక్ ఇ-తాలిబాన్ పాకిస్థాన్(టిటిపి) ముష్కరులు తలపై కాల్చిన సంగతి తెలిసిందే. బాలికల విద్యా కోసం పోరాడినందుకు ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడారు.
 
అనంతరం మాలాలకు లండన్‌ని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది. 2009లో బిబిసిలో వచ్చిన ఆమె ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి పరిచయమైన మలాలా మాంచి పాపులారిటీతో మాలాల నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయింది.
 
తన జీవిత చరిత్రను విడుదల చేసిన ఆమె, తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం బర్మింగ్ హామ్‌లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది. ఇంకా ఈయూ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ‘సఖోరోవ్ హుమన్ రైట్స్'ను మలాలా అందుకుంది.

Share this Story:

Follow Webdunia telugu