Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలాలాకు నోబెల్ శాంతి బహుమతి.. భారతీయుడు కైలాస్ సత్యార్ధి కూడా..

మలాలాకు నోబెల్ శాంతి బహుమతి.. భారతీయుడు కైలాస్ సత్యార్ధి కూడా..
, శుక్రవారం, 10 అక్టోబరు 2014 (15:19 IST)
పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్‌తో పాటు భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్ధికి 2014 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి ప్రకటించారు. ఈ మేరకు 'రాయల్ కాడమీ ఆఫ్ స్వీడిష్' శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. విదీష ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్ధి బచ్‌పన్ బచావో ఆందోళన్ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. 80 వేల మంది బాలలను రకరకాల అణచివేతల నుంచి రక్షించారు. భారత్‌లో నోబెల్ బహుమతి అందుకోనున్నఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్ధి. 
 
అలాగే, 17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి మాలాలా యూసఫ్ జాయ్ పొందింది. 2012 అక్టోబర్‌లో వాయువ్య స్వాత్‌ లోయలో మలాలపై తెహ్రీక్ ఇ-తాలిబాన్ పాకిస్థాన్(టిటిపి) ముష్కరులు తలపై కాల్చారు. అదేసమయంలో ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. బాలికల విద్యా కోసం పోరాడినందుకు ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడారు. అనంతరం మాలాలకు లండన్‌ని ఓ ఆస్పత్రిలో చికిత్స జరగగా అక్కడే కోలుకుంది. 
 
ఇటీవలే తన జీవిత చరిత్రను విడుదల చేసిన ఆమె, తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం బర్మింగ్ హామ్‌లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది. ఆమె గత యేడాది ఈయూ ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘సఖోరోవ్ హుమన్ రైట్స్' అందుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu