Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటిజం ఉంటే పిల్లల్ని చంపేస్తారా..! ఆమె తల్లేనా..!! 18 యేళ్ళు జైలు శిక్ష

ఆటిజం ఉంటే పిల్లల్ని చంపేస్తారా..! ఆమె తల్లేనా..!! 18 యేళ్ళు జైలు శిక్ష
, శుక్రవారం, 29 మే 2015 (21:11 IST)
ఆటిజంతో ఉన్నారని చంపేస్తామా...! అదీ కన్న తల్లే... ! వారికి థెరఫీ ఇప్పిస్తే కొంత మెరగవచ్చుగా. ఆమె చేసింది తప్పే. క్రూరమైన హత్యే.. అంటూ లండన్ కోర్టు ఆ తల్లికి 18 యేళ్ల జైలు శిక్ష విధించింది. ఇలా సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే ఈ శిక్ష తప్పదని భావించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
2010 సంవత్సరంలో మన్హట్టన్లోని ఓ ఖరీదైన హోటల్లో ఈ హత్య జరిగింది. తన ఎనిమిదేళ్ల కొడుకు జూడ్ మిర్రాకు క్రషర్, సిరంజి ద్వారా మందులు ఓవర్డోస్లో ఇచ్చి గిగి జోర్డాన్ చంపేసింది. దీనిపై అప్పటి నుంచే కేసు నడుస్తోంది. వాదోపవాదనలు జరిగాయి. అయితే, ఇది కేవలం మానవత్వంతో చేసిన హత్యేనని జోర్డాన్ న్యాయవాది విచారణలో వాదించారు. జూడ్ మిర్రా తండ్రి అతడిని లైంగికంగా వేధించకుండా నిరోధించడానికే ఆమె ఈ పని చేసిందనే వాదన తీసుకువచ్చారు. కొంతమేరకు సమ్మతించిన జడ్జి చార్లెస్ సాల్మన్ దాదాపు 25 ఏళ్ల వరకు పడాల్సిన జైలు శిక్షను 18 ఏళ్లకు తగ్గించారు.
 
తల్లి తన కొడుకును కాపాడుకోవాలనుకోవడం సహజమే గానీ, అందుకోసం ఆమె అతడిని ఎందుకు చంపిదన్న విషయం అర్థం కావట్లేదని జడ్జి వ్యాఖ్యానించారు. వాస్తవానికి మిర్రాకు తన విషయాలు తాను చెప్పుకోవడం చేత కాకపోయినా, తండ్రి ఎమిల్ జెకొవ్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లికి చెప్పాడని న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే యోగా ఉపాధ్యాయుడైన జెకొవ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇక ప్రాసిక్యూటర్లు మాత్రం తన కొడుకు ఆటిజంతో బాధపడుతున్నందువల్ల అతడిని పెంచలేక.. ఆమె అతడిని చంపేసిందని వాదించారు. అన్ని వాదనలు విన్న తరువాత జడ్జి తన తీర్పును వెలువరించారు. జోర్డాన్ కు 18 యేళ్ళ జైలు శిక్షను ఖరారు చేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu