Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియన్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు!

ఇండియన్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు!
, బుధవారం, 15 అక్టోబరు 2014 (13:54 IST)
శక్తిదేవి అనే మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఐక్యరాజ్య సమితి ‘అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014’ అవార్డును కైవసం చేసుకున్నారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. 
 
అఫ్ఘానిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి విధి నిర్వహణలో ఎన్నో విజయాలు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళా కౌన్సిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపుల బాధితులకు అందించిన సేవలకు గుర్తింపుగా శక్తిదేవికి ఈ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రదానం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu