Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్యకు ప్రతిచర్య : గూఢచర్యం ఆరోపణలపై భారత్ దౌత్యాధికారిని బహిష్కరించిన పాక్

పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని

చర్యకు ప్రతిచర్య : గూఢచర్యం ఆరోపణలపై భారత్ దౌత్యాధికారిని బహిష్కరించిన పాక్
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:53 IST)
పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని తమ దేశం వీడి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. 
 
న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆఫీసులో పనిచేస్తున్న మహ్మూద్ అఖ్తర్ (35)ను 48 గంటల్లోగా దేశం విడిచి పోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరిని ఢిల్లీ జూపార్కు వద్ద కలుసుకున్న ఆయన, సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారమున్న పత్రాలను స్వీకరిస్తుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయనను దేశం వీడి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. 
 
ఈ వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేస్తున్న సుర్జీత్ సింగ్‌పై వేటు వేసింది. శుక్రవారం సాయంత్రంలోగా సుర్జీత్ తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. వియన్నా సదస్సు నిర్ణయాలు, ద్వైపాక్షిక నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చెబుతూ భారత హై కమిషనర్‌కు సమన్లు పంపింది. ఆయన్ను వెంటనే ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావోయిస్టు అగ్రనేత ఆర్కేను ఎన్‌కౌంటర్ చేశారా? స్పందించని పోలీసులు!