Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిరియాలో అమెరికా జర్నలిస్టు తల నరికేసిన మిలిటెంట్లు!

సిరియాలో అమెరికా జర్నలిస్టు తల నరికేసిన మిలిటెంట్లు!
, బుధవారం, 20 ఆగస్టు 2014 (13:11 IST)
సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తాము రెండేళ్ళ క్రితం కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ పోలీ తలను అత్యంత కిరాతకంగా నరికేశారు. జర్నలిస్టు తల నరకక ముందు ఫొటోని, తల నరికిన తర్వాత ఫొటోని, వీడియో కూడా మీడియాకి విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ వీడియో సంచలనం సృష్టించింది. 
 
‘అమెరికాకు ఓ సందేశం’ అనే పేరుతో తీవ్రవాదులు ఈ వీడియో పోస్ట్ చేశారు. నారింజ రంగు దుస్తులు ధరించిన ఫోలీని ఓ ఎడారి ప్రాంతంలో మోకాళ్ల మీద నిలబెట్టి, పక్కనే ఓ ఉగ్రవాది తలకు ముసుగు వేసుకుని నల్ల దుస్తుల్లో ఉన్నాడు. సాధారణంగా నారింజ రంగు దుస్తులను అమెరికా సైన్యం అదుపులో ఉండే ఖైదీలకు వేస్తారు. అతడి పక్కనే ఉన్న ఉగ్రవాది ఇంగ్లీషులో మాట్లాడాడు. 
 
ఆ తర్వాత అతడు జేబులోంచి కత్తి తీసి, ఫోలీకి మరణశిక్ష విధిస్తున్నట్లు చెప్పాడు. ఇరాక్లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించడంతో అందుకు ప్రతీకారంగా ఈ శిక్ష వేస్తున్నామన్నారు. ఫోలీ కూడా తన చావుకి అమెరికాయే కారణం అని చెప్పినట్టుగా వీడియోలో వుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu