Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా సైనిక దాడులు: ఐఎస్ఐఎస్ చీఫ్ బకర్‌కు తీవ్రగాయాలు!

అమెరికా సైనిక దాడులు: ఐఎస్ఐఎస్ చీఫ్ బకర్‌కు తీవ్రగాయాలు!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (19:21 IST)
అమెరికా సైనిక దళాల దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాది తీవ్రంగా గాయపడ్డాడని తెలిసింది. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో ఐస్ఐఎస్ అధినేత తీవ్రంగా గాయపడ్డాడని ది గార్డియన్ పత్రిక తన కథనంలో వెల్లడించింది. మోసుల్ పట్టణానికి 200 కి.మీ. దూరంలో అల్ బాజ్ అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. 
 
ఉమ్ అల్ రౌస్, అల్ ఖరాన్ అనే గ్రామాల మధ్య మూడు వాహనాల కాన్వాయ్‌పై మార్చి 18న సంకీర్ణ సేనలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో హనాల్లోని ఉగ్రవాదులందరూ దుర్మరణం చెందగా, ఐసిస్ అధినేత  తీవ్ర గాయాలయ్యాయి. అయితే బకర్ మెల్ల మెల్లగా కోలుకుంటున్నట్లు మీడియా కథనాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu