Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రూరత్వానికి పరాకాష్ట... కన్నతల్లిని కడతేర్చిన ఇసిస్ ఉగ్రవాది

క్రూరత్వానికి పరాకాష్ట... కన్నతల్లిని కడతేర్చిన ఇసిస్ ఉగ్రవాది
, శుక్రవారం, 8 జనవరి 2016 (21:16 IST)
ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఎంత క్రూరులో ఈ తాజా సంఘటన మరోమారు రుజువు చేస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ తీవ్రవాదులు పాల్పడుతున్న అనేక ఘటనలు వారి క్రూరత్వానికి పరాకాష్టగా ఉన్నాయి. తాజాగా ఓ ఉగ్రవాది కన్నతల్లినే తుపాకీతో కాల్చి చంపేశాడు. సిరియన్‌ అబ్జర్వేటరీ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
ఈ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. సిరియాలోని రఖాలో ఉండే అలీ సకర్‌ అల్‌ ఖాసిమ్ అనే 20 యేళ్ల ఉగ్రవాది తల్లి లెనా (45). ఇస్లామిక్‌ స్టేట్‌లో పనిచెయ్యడం మానేయమని, రఖా నుంచి పారిపోయి వేరే చోట బతుకుదామని ఆమె కుమారుడిపై గత కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు జనసందోహం గల ఓ ప్రాంతానికి తల్లిని తీసుకువెళ్లాడు. అక్కడ అందరి మధ్య... ఆమె తలకు తుపాకీ గురి పెట్టి కాల్చి చంపాడు. 

Share this Story:

Follow Webdunia telugu