Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా ఎంపీ రికార్డ్..!

భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా ఎంపీ రికార్డ్..!
, మంగళవారం, 12 మే 2015 (16:45 IST)
ఆస్ట్రేలియా దేశంలో ఒక ఎంపీ హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేసి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన డానియల్ మూకీ (32) ఆస్ట్రేలియాన్ న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం నుండి లేబర్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అక్కడ ఆయన ప్రమాణ స్వీకార సమయంలో భగవద్గీతపైన ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడిగా రికార్డు కెక్కారు.
 
డానియల్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రాజకీయ నాయకుడిని తానే అని, దీనిని అరుదైన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆస్ట్రేలియా తన తల్లిదండ్రుల వంటి వారిని స్వాగతించిందని, అందుకే తనలాంటివారు ఈ స్థాయికి ఎదిగారని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu