Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్యోన్య దంపతులు.. కానీ ఆ ఎన్నారై భర్తను భార్యను ఎందుకు కాల్చి చంపాడు?

అన్యోన్య దంపతులు.. కానీ ఆ ఎన్నారై భర్తను భార్యను ఎందుకు కాల్చి చంపాడు?
, గురువారం, 5 మే 2016 (14:58 IST)
ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వారిద్దరికీ ఇద్దరు కుమారులు. అయితే ఆరుపదుల వయస్సులో ఆ భర్తకు ఏమైందో ఏమో కానీ తన  భార్య (ఇండో-అమెరికన్)ను కాల్చి చంపేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఎన్నారై భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే శాన్‌జోస్‌లోని ఇండిగో ఓక్ లేన్‌లో నివాసముంటున్న జేమ్స్ నల్లాన్ (63) తన భార్య సోనియా (48) నల్లాన్‌ను గత శనివారం ఇంట్లోనే కాల్చి చంపాడు. ఆ సమయంలో నల్లాన్ కుమారులు సాహిల్(21), నితిన్ (20)లు ఇంట్లో లేకపోవడంతో పాటు స్థానికులు తుపాకీ శబ్ధం విని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనలో పోలీసులు జేమ్స్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే తమ పారెంట్స్ అన్యోన్యంగా ఉండేవారని.. అయితే అమ్మను నాన్న ఎందుకు చంపారో అర్థం కావట్లేదని కుమారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే నల్లాన్ సోదరుడు క్రిస్ నల్లాన్ మాత్రం జేమ్స్ నల్లాన్ మానసికంగా బాధితుడని చెప్తున్నారు. ఏడేళ్ల క్రితం ఇంటి పనుల్లో భాగం గాయపడిన జేమ్స్ మూడు నెలల పాటు కోమాలోకి వెళ్ళిపోయారని, కోమా నుంచి కోలుకున్నాక.. అతని వ్యక్తిగతంలో మార్పు వచ్చిందన్నారు. తన భర్తను సోనియా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేదని.. కోమాలో ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకుని చూసుకుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో ఢిల్లీ నిర్భయ తరహా ఘటన.. బాధితురాలి కుటుంబానికి ప్రధాని పరామర్శ