Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాన్ దావూ‌ద్ ఇబ్రహీం అరెస్ట్‌కు అమెరికా సాయం?

డాన్ దావూ‌ద్ ఇబ్రహీం అరెస్ట్‌కు అమెరికా సాయం?
, బుధవారం, 1 అక్టోబరు 2014 (17:06 IST)
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్, అమెరికా సహాయాన్ని కోరనుంది. అమెరికా పర్యటనలో భాగంగా మోడీ, ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగిన మరునాడే, అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పాక్‌‍లోని రెండు సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తూ అమెరికా ఆర్థిక శాఖ తీర్మానించింది. ఈ నేపథ్యంలో భారత్ ఆందోళనలను అమెరికా బాగానే అర్థం చేసుకుందన్న వాదన వినిపిస్తోంది. 
 
పాక్‌లో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను నిర్మూలించాలని మోడీ, ఒబామా భేటీలో ఇరు దేశాలు నిర్ణయించాయి. అంతేగాక, ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, డి-కంపెనీల ఆర్థిక మూలాలన్నింటిని కూడా స్తంభింపజేయాలని తీర్మానించాయి. 
 
ఈ క్రమంలో పాక్‌లో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసే విషయంలో సహకరించాలని భారత్, అమెరికాను కోరే అవకాశాలున్నాయని విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu