Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా దుశ్చర్యలపై ప్రతిస్పందించిన భారత్!

చైనా దుశ్చర్యలపై ప్రతిస్పందించిన భారత్!
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (10:26 IST)
చైనా దుశ్చర్యలను నిన్నటిదాకా భరిస్తూ వచ్చిన భారత్, ఆదివారం నుంచి తన ప్రతిస్పందన చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి చర్యగా ఇరు దేశాల మధ్య జరగనున్న మీడియా చర్చలకు రెడ్ సిగ్నల్ చూపింది. 
 
తద్వారా ఇకనైనా సరిహద్దు నిబంధనలను గౌరవించకపోతే, భవిష్యత్తులో మరిన్ని నిరసన చర్యలను ఎదుర్కోవడంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం తప్పదని తేల్చిచెప్పింది. 
 
ఏటా చైనాలోని పలు మీడియా సంస్థలకు చెందిన ఎడిటర్లు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు భారత మీడియా ప్రతినిధులతో భేటీ కావడంతో పాటు ఇక్కడి మీడియా స్థితిగతులపై అవగాహన పెంచుకుంటున్నారు. 
 
ఈ ఏడాది ఈ వారంలో చైనా ఎడిటర్లు భారత్ రానున్నారు. ఇందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే చైనా సైన్యం చొరబాటు యత్నాలు ఏమాత్రం తగ్గని నేపథ్యంలో మీడియా చర్చలను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu