Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫలించిన చర్చలు.. భారత్‌కు యురేనియం సరఫరాకు ఆస్ట్రేలియా సమ్మతం

ఫలించిన చర్చలు.. భారత్‌కు యురేనియం సరఫరాకు ఆస్ట్రేలియా సమ్మతం
, సోమవారం, 30 నవంబరు 2015 (15:55 IST)
భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఫలితంగా భారత్‌కు యురేనియం సరఫరాకు కాన్‌బెర్రా పాలకులు సమ్మతం తెలిపారు. భారత్ - ఆస్ట్రేలియా అణు సహకార ఒప్పందంలో భాగంగానే ఈ చర్చలు విజయవంతమయ్యాయి. ఫలితంగా ఆస్ట్రేలియా- ఇండియా అణు సహకార ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రకటించారు. 
 
ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియన్ కంపెనీలు భారత్తో యురేనియం వ్యాపారం నిర్వహించుకోవడానికి వీలవుతుంది. భారత్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేయనుంది. భారత్కు యురేనియం సరఫరా చేయడానికి గతంలో కూడా ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నప్పటికీ న్యూక్లియర్ అణు నిరాయుధాకరణ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించడం, ఆస్ట్రేలియాలో ప్రభుత్వాలు మారడం లాంటి అంశాలు ఈ ఆలస్యానికి కారణమయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu